calender_icon.png 21 April, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు ఉండొద్దు

11-04-2025 12:46:56 AM

ఇల్లు, ప్లాటు జీవితకాలం పెట్టుబడి 

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ 

ఎల్బీనగర్‌లో హెచ్‌ఆర్సీఎస్ ఇండియా వెబ్‌సైట్ ప్రారంభం

ఎల్బీ.నగర్, ఏప్రిల్10 : రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు ఉండొద్దని, ప్రతి వ్యక్తి జీవితంలో ఇల్లు, ప్లాటు జీవితకాలం పెట్టుబడి అని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలకు మేలు చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు.  ఎల్బీనగర్ లోని బీవీకే మల్టీప్లెక్స్ పక్కన హెచ్‌ఆర్సీఎస్ ఇండియా డాట్ కామ్ ది ప్రాపర్టీ మ్యాచ్ మేక్స్ కి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్‌ఆర్ సీఎస్ సీఈవో హర్షవర్ధన్ రెడ్డితో కలిసి హెచ్‌ఆర్సీఎస్.కామ్ వెబ్ సైటును గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ..  రియల్ ఎస్టేట్ స్తబ్ధత ఫీల్ లెవెల్ ఎంక్వయిరీ మొదటి ప్రాధాన్యత అన్నారు. ఏదైనా స్థలం కొనేటప్పుడు ఒకటికి పదిసార్లు లీగల్ గా చూసుకుని ముందుకు సాగాలన్నారు. ఒక దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంకో దగ్గర నిర్మాణం చేపట్టే ఆ క్రమ నిర్మాణదారులు ఎక్కువయ్యారని, ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ముందు ఆలోచించి అడుగేయాలని సలహా ఇచ్చారు. ప్రాపర్టీ కొనుగోలుదారుల మంచి కోసం హెచ్ ఆర్ సీఎస్ కృషి చేయాలని కోరారు.

అక్రమ కట్టడాలను రూపుమాపేందుకు పనిచేసే ప్రతి వారికి తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. హెచ్ ఆర్ సీఎస్ సీఈవో హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ మధ్యన హైడ్రా కూల్చివేతలు జరిగిన కట్టడాలకు కూడా బ్యాంకర్లను మేనేజ్ చేసుకుని లోన్స్ ఇస్తున్నారన్నారు. మనం  తీసుకొనే ప్రాపర్టీ 80 శాతం లోనుకు వెళ్లాల్సి వస్తుందని, నెలనెలా ఈఎంఐ కట్టింది పోగా మిగిలిన దానిపై కుటుంబం మొత్తం ఆధారపడువాల్సి వస్తుందని, అలాంటి ప్రాపర్టీ కొన్నాక లీగల్ గా ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బందిపడాల్సి వస్తుందని తెలిపారు.

ఇలాంటివి సమస్యలు రాకుండా ఉం డేందుకు కొనుగోలుదారులు నేరుగా ఎల్బీనగర్ లోని హెచ్‌ఆర్ సీఎస్ సంస్థను నేరుగా లేదా వెబ్ సైట్ ద్వారా సంప్రదిస్తే టాప్ 5 బ్యాంకర్ల నుంచి కంపేరిజన్ ఇస్తామని తెలిపారు. ఏ బ్యాంకులో ఎంత ఎలిజిబిలిటీ, ఎంత రేట్ అఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో చెప్పడమే కాకుండా కొనుగోలు చేయనున్న ప్రాపర్టీ లీగల్ గా సరైందా కాదా? అని ప్రాథమికంగా నిర్ధారిస్తామని, ఇదంతా ఫ్రీ సర్వీస్ అని తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీఐ సెక్యూరిటీస్ ఏజీఎం రమణ మూర్తి, డిజిటల్ హెడ్ కోవెల, ఎంప్లాయిస్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.