26-04-2025 12:46:03 AM
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): కామారెడ్డి పట్టణంలోని 49 వార్డుల్లో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రావద్దని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు.వేసవిలో నీటి ఎద్దడి దృష్టిలో పెట్టుకొని శుక్రవారం తాగునీటి సమస్యలపై వాటర్ అధికారులతోత ఎమ్మెల్యే శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వార్డు అధికారులు , వాటర్ మెన్లతో వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణం ఉండే 49 వార్డులో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య రావద్దని ఎక్కడ సమస్యలున్న టాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని అధికారులు సూచించారు ఇంటింటికి నీటి సరఫరా సమయంలో ఇంటి యజమానుల నుండి డబ్బులు వసూలు చేయరాదని ఒకవేళ అలా చేసే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులకు సూచించారు .ఏ వార్డులో నీటి సమస్య ఉందని ఫిర్యాదు వచ్చిన సంబంధిత వార్డు అధికారి బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. రాజకీయ నాయకులు ఇళ్లలో గాని అధికారులు ఇళ్ల నీటి సంపుల్లో నీటిని పోయారాదని అలాంటివి తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు.