calender_icon.png 5 April, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంపిణీలో తేడా రావొద్దు

05-04-2025 02:08:05 AM

  1. సన్నబియ్యంలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవు 
  2. రేషన్ దుకాణాలకు వేగంగా సన్నబియ్యం రవాణా, పంపిణీ
  3. కొత్త ఆహార భద్రతా కార్డుల దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తిచేయాలి
  4. శ్రీరామనవమి రోజు భద్రాచలంలో లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం
  5. కలెక్టర్ల వీడియోకాన్ఫరెన్స్‌లో పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): సన్నబియ్యం పంపిణీలో తేడా అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని, తేడా జరిగితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ర్టంలో అత్యధిక జనాభా దొడ్డుబియ్యం తినడం ఆపేశారని, అందుకే  ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు.

రాష్ట్రంలోని 84 శాతం జనాభాకు సన్నబియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నామని, దీంతో 84 శాతం జనాభా ఆహా రభద్రతకు సుస్థిరత ఏర్పడిందన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ శాంతికుమారితో కలిసి సన్నబియ్యం సరఫరాపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రేషన్‌దుకాణాలకు సన్నబియ్యం సరఫరా రవాణాను వేగవంతం చేయాలని సూచించారు. రవా ణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి, సన్నబియ్యం రవాణాపై కలెక్టర్‌లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శ్రీరామనవమి పర్వదినం రోజు భద్రాచలంలో సన్నబియ్యం లబ్ధ్దిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేయనున్నారని తెలిపారు.

జిల్లాస్థాయిలో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కలెక్ట ర్లు, ఇతర ఉన్నతాధికారులు పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్నబియ్యంతో భోజనం చేయాలని మంత్రి సూ చించారు. రూ.13వేల కోట్లు ఖర్చు చేసి, 30లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ఆహార భద్రత కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నా రు.

దొడ్డుబియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కోళ్లఫారాలకు, ఇతర అవసరాలకు తరలించేవారని, ఇప్పుడా పరిస్థితి ఉండదన్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి మాట్లాడు తూ..సన్నబియ్యం పంపిణీతో రేషన్‌దుకాణాల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగిందని, అందుకు బియ్యం రవాణాను వేగవంతం చేయాలని, రేషన్ షాపుల్లో తగినంత బియ్యం అందుబాటులో ఉండాలని సూచించారు.

సంచుల కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సన్నబి య్యం పంపిణీపై ప్రభుత్వ చిత్తశుద్ధి చాటేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయా లన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అద నపు కలెక్టర్ వీరారెడ్డి, సివిల్ సప్లు మేనేజర్ శ్రీనివాస్, అసిస్టెంట్ సివిల్ సప్లు అధికారి రోజారాణి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.