మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి): సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హుస్సేన్ సాగర్ పీవీ మార్గ్‌లోని నీరా కేఫ్‌లో జరిగిన గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(గోపా) నూతన కార్యవర్గం ప్రమా ణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోపా ప్రతినిధులు అవసరమైన వారికి విద్య, పోటీ పరీక్షలు నిర్వహిం చాలని, మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయ కుల మధ్య ఐక్యతను తీసుకురావాలన్నారు. చదువుకొని వృత్తిపరంగా స్థిరపడి, సామాజిక స్పృహ కలిగిన వారందరిని గోపాలో భాగస్వాములను చేయాలని తెలిపారు.
ఇప్పటివరకు వెనుకబడిన తరగతులకు ఇండస్ట్రీస్ అసోసియేషన్ లేదని, ఇందుకు కోసం గోపా ప్రతినిధులు ముందుకు రావాలని కోరారు. ఏ వృత్తిలో ఉన్నా గౌడ మేధా వులందరినీ గోపాలో భాగస్వామ్యులను చేయాలన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గోపా నాయకులు పాల్గొన్నారు.