calender_icon.png 17 October, 2024 | 4:56 AM

నిత్యం నేర్చుకునే తత్వం ఉండాలి

17-10-2024 03:04:20 AM

డ్యూటీ మీట్‌లో డీజీపీ జితేందర్

రాజేంద్రనగర్, అక్టోబర్16: పొరపాట్లు సరిదిద్దుకుంటూ ముందుకు సాగటంతో పాటు నిత్యం నేర్చుకునే తత్వంతోనే నేరాలను సులభంగా ఛేదించవచ్చని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోలీస్ అకాడ మీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మొదటి పోలీస్ డ్యూటీ మీట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్యూటీ మీట్ పోలీసు సిబ్బందిలో ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నారు.

సాంకేతికతను వినియో గించుకొని బాధితులకు సత్వర న్యాయం చేసినప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుందని అన్నారు. ఈనెల 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో భాగంగా కేసుల ఛేదన, ఇంటరా గేషన్, మెలకువలు తదితర అంశాలపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన అధికా రులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో  సీఎస్ శాంతికుమారి, పోలీసు ఉన్నతాధికారులు మహేష్ భగవత్, శిఖాగోయల్, వివిధ జిల్లాలకు చెందిన 400 మంది పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.