calender_icon.png 9 October, 2024 | 3:48 PM

దేశమంతా మార్పు రావాలి

08-10-2024 01:26:23 AM

మహారాష్ట్ర తరహాలో గోవును రాజ్యమాతగా గౌరవించాలి

జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి 

రాయ్‌పూర్, అక్టోబర్ 7: సంప్రదాయంగా వస్తున్న గోమాతను పూజించడం తోపాటు రక్షించడం మన కర్తవ్యమని జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వ రానంద్ సరస్వతి అన్నారు. మన వేదాలు, పురాణాలు ఇవే చెబుతున్నాయని గుర్తుచేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని శంకరాచార్య చౌక్‌లో సోమవారం స్వామీజీ గోధ్వజ్ స్థాపన చేశారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మేం చేపట్టిన యాత్ర ఫలితంగా కొన్ని రాష్ట్రాలు ఆవును పశు సూచిక నుంచి తొలగించి రాజ్యమాతగా గౌరవించాయి. దేశవ్యాప్తంగా ఇది జరగాలి. జాతీయ స్థాయిలో దీన్ని అమలు చేయాలి. ఇది కచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. హిందూ సమాజంలో పాపపుణ్యాలను బేరీజు వేసుకుంటారు.

గోహత్య మహాపాపం. దీన్ని ఎవరూ సమర్థించరు. అందుకే గోహత్యకు సమర్థించే పార్టీలకు మద్దతివ్వకూడదని పిలుపునిచ్చా. ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు గోసంరక్షణకు పాటుపడుతామనే హామీని తీసుకోవాలని చెప్పా. వాళ్లకే ఓటు వేయాలని చెప్పా అని వివరించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఝార్ణేశ్వర మహాదేవ్ ఆలయంలో గోప్రతిష్ఠ ధ్వజ్ స్థాపన జరగనుంది. అనంతరం గోప్రతిష్ఠ సమావేశాన్ని స్వామీజీ నిర్వహించనున్నారు.