10-04-2025 02:35:30 AM
2019 ఏప్రిల్‌కు ముందున్న వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి
సెప్టెంబర్ చివరి నాటికి తీసుకోకుంటే చర్యలు
ఉత్తర్వులు జారీచేసిన సర్కార్
హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) లేని పాత వాహనాలకు వాటిని బిగిం చుకొనేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వర కు గడువు విధిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
2019, ఏప్రిల్ 1కి ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న అన్ని వాహనాలు తప్పనిసరిగా హెచ్‌ఎస్‌ఆర్‌పీని బిగించుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతలోపు కొత్త నెంబర్ ప్లేట్లు బిగించుకోకపోతే ఎంవీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు.
ప్రభుత్వ అనుమతి ఉన్న గుర్తింపు ఉన్న డీలర్ల వద్దే ఈ హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు బిగించుకోవాల్సి ఉం టుంది. ఇందుకోసం www. siam.in పోర్టల్‌లో వాహనదారులు నిర్ణయించిన ఫీజు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలి. తర్వాత హైసెక్యూరిటీ ప్లేటు బిగించుకున్న తర్వాత వాహనం ఫొటోలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అయితే వాహనదారులు తమకు అందుబాటులో ఉన్న డీలర్ల వద్దే ఈ నెంబర్ ప్లేట్లను బిగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
హైసెక్యూ రిటీ నెంబర్ ప్లేట్ల వల్ల వాహనాల చోరీ సమయంలో, ఏదైనా నేరం జరిగినప్పుడు సదరు వాహనాన్ని వెంటనే గుర్తించేందుకు పోలీసులకు అవకాశం ఉంటుంది. ఈ నెంబర్ ప్లేట్లు బిగించుకోని వాహనాలకు గడువు ముగిసిన తర్వాత బీమా సౌకర్యంతో పాటు పొల్యూషన్ సర్టిఫికెట్ల జారీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ కూడా ఉండబోదని సర్కారు స్పష్టం చేసింది.