calender_icon.png 6 November, 2024 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పవన్ వ్యాఖ్యల్లో తప్పేం లేదు

06-11-2024 01:18:33 AM

హోం మంత్రి అనిత

అమరావతి, నవంబర్ 5: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. పవన్ కల్యాణ్ మాటలను బాధ్యతగా తీసుకుని కలసి పని చేస్తామని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు అధికారులతో హోం మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ‘మహిళలపై అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలపై సమీక్షలో చర్చించాం. ఇక్కడ గ్యాంగ్ రేప్ జరగడం చాలా బాధాకరం. కిరాతకులుగా మారిన ఇటువంటి నేరస్తులపై గత ప్రభుత్వంలో చర్యలు తీసుకోలేదు.

అందుకే వారు ఇంతకు తెగిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తు న్నాం. ఎవరైనా సోషల్ మీడియాలో రెచ్చిపోతే.. కఠిన చర్యలు ఉంటాయి’ అని అన్నా రు. అంతకు ముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గొల్లప్రోలులో సభలో మాట్లాడుతూ..‘హోం శాఖ నేను తీసుకుంటే పరి స్థితులు వేరుగా ఉంటాయి’ అని అన్నారు. 

అవును.. తప్పులు జరిగాయి: డీజీపీ

అనంతపురం, నవంబర్ 5: గత ఐదేళ్ల కాలంలో కొన్ని తప్పులు జరిగాయని ఏపీ డీజీపీ ద్వారకాతిరుమల రావు ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆ తప్పులను సరిదిద్దడం పై దృష్టి పెట్టినట్లు వివరించారు. అనంతపురంలో డీజీపీ మీడియాతో మాట్లాడుతూ... ‘మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం. ఐజీ సంజయ్‌పై వచ్చిన ఆరోపణ లపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తోంది. ఆ విచారణ నివేదిక జీఏడీకి వెళ్లిన తర్వాతే మాకు తెలుస్తుంది.

గత ప్రభుత్వ హయాం లో ఓ పార్టీ కార్యాలయంపై దాడి జరిగినా పట్టించుకోలేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ వల్లే దాడి జరిగిందని పోలీసులే కేసును నీరు గార్చారు. న్యాయం చేసేందుకే చట్టాలు కోర్టులు ఉన్నాయి” అని డీజీపీ అన్నారు.