04-03-2025 01:21:05 AM
తనదైన శైలితో అవినీతి అక్రమాలపై నిఘా... అక్రమాలు చేస్తే సహించేది లేనే లేదు
అవినీతి ఆరోపణలు వస్తే చాలు అధికారుల బదిలీ, సస్పెన్షన్‌కు ఎమ్మెల్యే సిఫారసు
జడ్చర్లలో హాట్ టాపిక్‌గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
మహబూబ్ నగర్ మార్చి 3 (విజయక్రాంతి) : తెలియకుండా తప్పు చేస్తే భయం ఉండాలి.. తప్పు చేసేందుకే వీలు లేకుండా పరిపాలన ఉండాలి.. ప్రజలకు అధికారులు జవాబు దారితనంగా ఉండాల్సిందే.
ప్రజలు చెల్లించిన పనులతో వేతనాలు తీసుకుంటున్న అధికారులు ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదంటూ వారి భరతం పట్టేలా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నత అధికారులకు బదిలీ, సస్పెండ్ లకు సిఫారసు చేస్తూ నేనింతే ప్రజలకు న్యాయం చేయవలసిందే అంటూ సాంకేతాన్ని పంపిస్తున్నారు.
ఈ క్రమంలో జడ్చర్లలో ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీ, సస్పెండ్ లే ఇందుకు సాక్షదారులుగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జడ్చర్ల ఎమ్మెల్యే వైపు; నియోజకవర్గం ప్రజలు మద్దతు తెలియజేస్తున్నారు.
అధికారుల బదిలీ, సస్పెన్షన్
అధికారులు తప్పు చేస్తే వారిని ప్రజా ప్రతినిధులు కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న విషయాలను మనం చూస్తుంటాం. కాగా జడ్చర్ల నియోజకవర్గం లో మాత్రం అవినీతికి మద్దతు తెలిపిన అధికారులను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నతాధికారులకు సంబంధిత అధికారులను పై బదిలీ, సస్పెన్షన్కు సిఫారసు చేస్తూ తనదైన చెలిలో ముందుకు సాగుతున్నారు.
గతంలో బాలనగర్ తాసిల్దార్ కార్యాలయం లో ఆర్ ఐ ఆదివారం డ్యూటీ చేసి రికార్డులు తారమూరు చేస్తున్నారని ఆరోపణ రావడంతో స్వయంగా ఎమ్మెల్యే తాసిల్దార్ కార్యాలయానికి చేరుకొని పరిశీలించి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయించారు. జడ్చర్ల ఎమ్మార్వో; సత్యనారాయణ రెడ్డి భూ రికార్డులు తారుమారు చేశారని ఎమ్మెల్యే దృష్టికి రావడంతో తాసిల్దార్ ను సస్పెండ్ చేయించడం జరిగింది.
గ్రామపంచాయతీ పోలేపల్లి గ్రామ నిధులు దుర్గి నగనికి పాల్పడ్డారని గ్రామపంచాయతీ కార్యదర్శి; సస్పెండ్ చేయించారు. జడ్చర్ల తాసిల్దార్ బ్రహ్మం గౌడ్, డిప్యూటీ ఎమ్మార్వో రాజీవ్ రెడ్డి, ఆర్ ఐ లను అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి రావడంతో బదిలీ చేయించడం జరిగింది.
హాట్ టాపిక్‌గా సిఐ ఆదిరెడ్డి బదిలీ..
ఉన్నట్టుండి జడ్చర్ల సిఐగా విధులు నిర్వహించిన ఆదిరెడ్డి బదిలీ జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశం అయింది. ఉన్నట్టుండి ఫిబ్రవరి 10వ తేదీన హైదరా బాద్ నుంచి రాత్రి 10 గంట ల సమయంలో సిఐగా కమలాకర్ నేరుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో విచ్చేసి నేను జడ్చర్ల సిఐగా బదిలీపై వచ్చానని తెలపడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న సిఐ ఆదిరెడ్డి ఆశ్చర్యానికి గురి అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
మరుసటి రోజు జిల్లా ఎస్పీ డి జాన కిని ఎస్పీ కార్యాలయంలో కలిసి రిపోర్ట్ చేసి జడ్చర్ల సిఐగా బాధ్యతలు తీసుకున్నారు. జడ్చర్ల సిఐగా విధులు నిర్వహించిన ఆదిరెడ్డిని గద్వాల జిల్లాకు బదిలీ చేయడం జరిగిం ది. ఈ అంశం జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖలో తీవ్ర చర్చిని అంశం అయింది.
అక్రమంగా మట్టి తవ్వితే ఐదు కోట్ల జరిమానా
రాజాపూర్ మండలంలో తిరుమలాపూర్ గ్రామంలో వెంచర్లకు ఓ గుట్ట నుంచి అత్యధికంగా అక్రమంగా మట్టిని అనుమతి లేకుండా తరలించాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టికి వచ్చింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అప్పటి మైనింగ్ జిల్లా అధికారి విజయ్ కుమార్ కు ఫిర్యాదు చేసి ఇంత మేరకు మట్టి తరలించాలని అంచనాలు తయారుచేసి రూ 5 కోట్లు జరిమానా విధించేలా చర్యలు తీసుకున్నారు.
మైనింగ్ శాఖ ఏడి విజయకుమార్ బదిలీ అయ్యే సమయంలో జరిమానా విధించిన డబ్బులను చెల్లించాల్సిన అవసరం లేదని సం బంధిత జరిమానా విధించిన వారికి సర్కులర్ జారీ చేసి బదిలీ అయ్యారు. ఈ విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే బదిలీపై వెళ్లిన విజయ్ కుమార్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఇతర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ సస్పెండ్ చేయించారు.
ఇలా ప్రతి విషయంలోనూ పారదర్శకంగా జడ్చర్ల ఎమ్మెల్యే ముందుకు సాగడంతో జడ్చర్ల నియోజకవర్గం వర్గ ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నారు.