మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
చేవెళ్ల, జనవరి 19: మాలల జోలికొస్తే ఊరుకునేది లేదని మాల మహానాడు జాతీ య అధ్యక్షుడు చెన్నయ్య హెచ్చరిం చారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రం లోని అంబేద్కర్ భవన్లో మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల స మావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు మాలల వ్యతిరేక వైఖరిని మానుకోవాల న్నారు.
మేధావుల ముసు గులో మాలలపై విషం కక్కుతున్న వారి కుట్రలను త్రిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. అనంతరం మా ల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా నాయకురాలు రవళి, రమ అధ్యక్షతన నూతనంగా రంగా రెడ్డి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మాల వికాస్, మాల యువత రాష్ట్ర ప్రధాన కార్యద ర్శిగా బేగరి మహేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బి మహేష్, జిల్లా ఉపాధ్యక్షుల డిగా పనగారి యాదగిరి, సురేష్, సహాయ కార్యదర్శి పి.మాణిక్యం, ప్రచార కార్యదర్శి గా కే.మురళీమోహన్, కార్యనిర్వాహక కార్య దర్శి గా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాచనపల్లి రామస్వామి, షాద్నగర్ డివిజన్ ఉపాధ్య క్షులు సుంకం నరసింహ, ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు శేఖర్, గణేష్, అరుణ్, తేజ, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.