26-04-2025 12:00:00 AM
ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
తాంసి, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : రాష్ట్రం ఏర్పడిన 10 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన సంవత్సరం కాలం గడవగానే అధికార కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నేతలే నమ్మే పరిస్థితుల్లో లేరని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చివాట్లు పెడుతూ పార్టీని వీడుతున్నారన్నారు.
తాంసి మండల జామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మం డల అద్యక్షుడు అశోక్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 250 మంది కాంగ్రెస్ పార్టీని వీడి శుక్రవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం పుట్టిన బీఆర్‌ఎస్ పార్టీయే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందన్నారు. సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసగించిందన్నారు. పార్టీ నాయకులను కార్యకర్తలు సైతం పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ నేతలు బీఆర్‌ఎస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.