22-03-2025 01:04:20 AM
శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి) : వికారాబాద్‌లో రోడ్లు సక్రమంగా లేక అబ్బాయిలెవరికి పిల్లను ఇచ్చే పరిస్థితి కూడా లేకుండాపోయిందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అన్నారు. ఈ వ్యాఖ్యలతో కాసేపు సభలో నవ్వులు వెల్లివిరిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్లు నిర్మించడంలేదని, హ్యామ్ రోడ్ల పేరిట టోల్ రోడ్లు తెస్తున్నారని.. తమ హయాంలో అద్భుతంగా రోడ్లు వేశామని, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబు ల్ రోడ్లు వేశామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతుండగా.. స్పీకర్ జోక్యం చేసుకున్నారు.