నయనతారకు ‘చంద్రముఖి’ సినిమా నిర్మాతలు నోటీసులు పంపారంటూ ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. తమ అనుమతి లేకుండా సినిమాలోని సన్నివేశాన్ని ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీలో వాడారని దీనికి రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ చంద్రముఖి నిర్మాతలు నోటీసులు జారీ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన చంద్రముఖి నిర్మాణ సంస్థ అయిన శివాజీ ప్రొడక్షన్స్..
తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. అలాగే రూ.5 కోట్లు డిమాండ్ చేశామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. నయనతార తన డాక్యుమెంట్ కోసం ముందుగానే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నారని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ఆ సర్టిఫికెట్‌ను షేర్ చేశారు. “నయనతార తన డాక్యుమెంటరీని రూపొందించడానికి ముందే మా నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నారు.
‘చంద్రముఖి’లో సన్నివేశాలను ఉపయోగించడంపై మేము ఎలాంటి నోటీసులూ పంపలేదు” అని శివాజీ ప్రొడక్షన్స్ స్పష్టం చేసింది. ధనుష్ మాత్రం తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజ్‌ను వాడారని దానికి గానూ రూ.10 కోట్లు చెల్లిం చాలంటూ లీగల్ నోటీసులు పంపించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. జనవరి 8 లోపు ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ నయన తార దంపతులతో పాటు నెట్‌ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది.