calender_icon.png 7 January, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ వార్తల్లో నిజం లేదు..

31-12-2024 01:49:00 AM

ప్రభాస్ ప్రధాన పాత్ర లో నటించిన చి త్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే రెండవ భాగం షూటింగ్ మొదలు కానుంది. దీపిక పాల్గొననున్నారంటూ వస్తున్న వార్తలపై తాజాగా ఆమె స్పందించారు.

ఈ వార్తల్లో నిజం లేదని పరోక్షంగా వెల్లడించారు. “నా కుమార్తెను మా అమ్మ నన్ను ఎలా అయితే చూసుకున్నారో అదే విధంగా నా పాపను నేనే దగ్గరుండి పెంచాలనుకుంటున్నా. నా కూతురి ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా” అని దీపిక తెలిపారు. అంటే కూతురుని ప్రస్తుతం వదిలి రానని దీపిక చెప్పకనే చెప్పారు.

ప్రస్తుతం పార్ట్ 2కు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇటీవల నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్ తెలిపిన వివరాల ప్రకారం పార్ట్ 2లో దీపిక కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించనున్నారట. పార్ట్ 1 షూటింగ్ సమయంలోనే పాటే పార్ట్ 2కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను సైతం చిత్రీకరించరించినట్టు స్వప్నదత్ వెల్లడించారు.