నిరుడు ‘సిటాడెల్’ సిరీస్‌తో అలరించింది నటి సమంత. ప్రస్తుతం ఆమె ఏ సినిమాలు చేయడంలేదు. అయితే ఈ బ్యూటీ ఈమధ్య పికిల్ బాల్ టోర్నీలో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించింది. దీంతో వీరిద్దరూ రిలేషనల్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత రిలేషన్స్ గురించి ఆసక్తి కర కామెంట్స్ చేసిం ది.
తనకు సంబంధించి గత సంబంధా లపై మాట్లాడింది. ‘జీవితంలో చాలా కష్టాలు పడ్డాను. అందుకే ప్రస్తు తం రిలేషన్ గురించి ఆలోచించట్లేదు. గతంలో రిలేషన్ షిప్‌లో ఉన్నవారి పట్ల నాకు ఎలాం టి అసూయ, కోపం ఉండవు. ఎందుకంటే అసూయ అన్ని చెడులకూ కారణమవు తుంది’ అని తెలిపింది సమంత.