- తెలంగాణకు ఏమి తెచ్చారో చెప్పాలి
- సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వద్ద చర్చకు రావాలి
- మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలో తె లంగాణ డీఎన్ఏ లేదని మంత్రి పొ న్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశా రు. ఒకవేళ ఉంటే కేంద్రమంత్రిగా రాష్ట్రానికి అదనపు నిధులు తెచ్చేవారని అన్నారు.
వరదల వల్ల రూ. 10 వేల కో ట్ల నష్టం జరిగితే, కేంద్రం రూ. 400 కోట్లు ఇచ్చినప్పుడే కిషన్‌రెడ్డి బలం ఎంతో అర్థమవుతోందని ఎద్దేవా చేశా రు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు.