సినిమా షూటింగ్ ను ప్రారంభించిన మాజీ మంత్రి రామన్న..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో కళాకారులకు కొదవలేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇక్కడి ప్రకృతి అందాలు సినీ పరిశ్రమతో పాటు టూరిస్టులు సైతం ఆకట్టుకుంటుందన్నారు. స్థానిక యాదవ సంఘ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన ఏ.బి క్రియేషన్స్ ఆధ్వర్యంలో డైరెక్టర్ రాజు గౌడ్ దర్శకత్వంలో నూతన చిత్రం 'అనాధ ప్రేమ' షూటింగ్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు.
ఈ మేరకు జోగు రామన్న మాట్లాడుతూ.. యువత సినిమా రంగంలో తమ కళ నైపుణ్యాన్ని నిరూపించుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4వేల కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశామన్నారు. పలు సినిమాలలో సైతం ఆదిలాబాద్ అందాలను చిత్రికరించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, సతీష్, చిన్న పటేల్, డైరెక్టర్ గజ్జు గౌడ్, భూపతి, నారాయణ్ రెడ్డి, హీరో కళ్యాణ్, బిమేష్, హీరోయిన్ యోగితా, విల్లన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.