calender_icon.png 23 February, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో మందుల కొరత లేదు

15-02-2025 01:42:03 AM

 డీఎం హెచ్ ఓ ఉమా గౌరీ 

మేడ్చల్, ఫిబ్రవరి 14(విజయ క్రాంతి): జిల్లాలో మందుల కొరత లేదని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి. ఉమా గౌరీ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని ద్మగూడ, కీసరలో బస్తీ, పల్లె దవఖానాల పనితీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను, ఫార్మసీ రిజిస్టర్ ను, ఓపిని పరిశీలించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులతో మాట్లాడారు.

మందుల నిల్వ గురించి అడిగి తెలుసుకున్నారు. కీసరలో నిర్మాణంలో ఉన్న ఆరోగ్య వెల్నెస్ సెంటర్ను సందర్శించి ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడారు. పల్లె దవఖాన కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు.

దీనిపై నివేదిక ఇవ్వాలని కీసర వైద్యాధికారికి సూచించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని, ఆయా కేంద్రాలలో ఎలాంటి లోపాలు లేవని తెలిపారు.