calender_icon.png 20 March, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాధాన్యత రంగాల ఊసే లేదు

20-03-2025 12:00:00 AM

ప్రాధాన్యత రంగాల్లో ఏవిధంగా ముందుకెళ్తామని చెప్పకుండా.. ప్రాజెక్టులు.. పనులవారీగా నిధుల కేటాయింపులు లేకుండా.. కొత్త పథకాల ఊసే ఎత్తకుండా.. కేవలం అంకెలతోనే రాష్ట్ర ప్రభుత్వం గారెడీ చేసే విధంగా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.

ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మేలు చేసే నిర్ణయం ఈ బడ్జెట్ లో లేకపోవడం దారుణం. పుణ్యక్షేత్రాల జిల్లా అయినా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి లకు ప్రత్యేక ప్యాకేజీలు ఏమీ ఇవ్వలేదు. 

దేవాదాయ శాఖకు కేవలం రూ.190 కోట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం. చేనేతరంగానికి కేవలం  రూ .371 కోట్లు కేటాయించడం సిగ్గుచేటు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూపాయలు 12,500 కోట్లు మాత్రమే కేటాయించారు.

 మాజీ మేయర్ సునీల్ రావు