calender_icon.png 22 October, 2024 | 11:37 PM

వడ్డీ రేట్ల కోతకు తొందరలేదు

12-07-2024 12:10:00 AM

ఆర్బీఐ గవర్నర్ దాస్

న్యూఢిల్లీ, జూలై 11: అనిశ్చిత ఆర్థిక వాతావరణం, ద్రవ్యోల్బణం 5 శాతం మేర కొనసాగుతున్నందున ఇప్పుడే వడ్డీ రేట్ల తగ్గింపుపై ప్రస్తుతం మాట్లాడ టం తొందరపాటు కాగలదని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నా రు. ఒక ఆంగ్ల చానల్‌తో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగానూ, భారత్‌లోనూ ఆర్థిక వాతావరణం అనిశ్చితంగా ఉన్నదని, అలాగే తమ సర్వేల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం సమీపంలోనే కొనసాగుతున్నదన్నారు. అందుచేత వడ్డీ రేట్లపై తాను ఎటువంటి భవిష్యత్ అంచనాల్ని వెల్లడించనని, అలా గైడన్స్ ఇస్తే అది మార్కెట్ ప్లేయర్లను, ఇతర భాగస్వామ్యపక్షాలను తప్పుడు రైలు ఎక్కిస్తుందని దాస్ వివరించారు. తమ 4 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యం సమీపంలో మ నం లేమని, అది ఇంకా 5 శాతం చుట్టుపక్కలే ఉన్నదన్నారు. ద్రవ్యోల్బణందిగివస్తున్నప్పటికీ, అది నెమ్మదిగా జరుగుతున్నదన్నారు. ద్రవ్యోల్బణం లక్ష్యా న్ని త్వరితంగా చేరుకోవాలంటే ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేయా ల్సి ఉంటుందని, వృద్ధికి, ద్రవ్యోల్బణానికి తగిన సమతౌల్యాన్ని తాము కొనసాగిస్తున్నందున, ద్రవ్య విధానం విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు.