calender_icon.png 17 March, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలం ప్రకటించేవరకు విరమించేదే లేదు

15-03-2025 12:00:00 AM

గట్టుఇప్పలపల్లి జేఏసి కమిటి ప్రకటన

తలకొండపల్లి,మార్చి 14(విజయక్రాంతి): గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించే వరకు నిరాహారదీక్షలను విరమించేదే లేదని గ్రామస్తులు భిష్మించుకూర్చున్నారు. గట్టుఇప్పలపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామ జేఏసి ఆద్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలు శుక్రవారం నాటికి 271వ రోజుకు చేరుకున్నాయి.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 11మండలాలను ప్రకటించిందని అందులో తమ గ్రామం పేరు లేకపోతే ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతామని గ్రామస్తులు  ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.దేశమంతా ప్రజలు చిన్నా పెద్దా తార తమ్యం లేకుండా  హోలీ సంభరాలు విదులన్ని తిరుగుతూ అంగరంగ వైభవంగా జటుపుకుంటుం టే గట్టుఇప్పలపల్లి గ్రామస్తులు మాత్రం దీక్షా శిభిరం ముందే హోలీ పండుగను జరుపున్నారు.

ఇన్ని రోజులుగా గ్రామస్తులు,పరిసర గ్రామాల ప్రజలు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు స్పందించకుండా నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడం సరికాదని దీనికో పరిష్కారం చూయించాలని పలువురు కోరుతున్నారు.