calender_icon.png 28 December, 2024 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు!

01-08-2024 01:24:03 AM

ఎంపీ అసదుద్దీన్ ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జవాబు

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): సింగరేణిని ప్రైవేటీకరణ ఆలో చనే కేంద్ర ప్రభుత్వానికి లేదని బుధవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పార్లమెంట్ వేదికగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. గనుల కేటాయింపులో పారదర్శకత కోసమే వేలం ప్రక్రియ చేపడుతున్నామని స్పష్టం చేశారు. వేలంలో ప్రభుత్వరంగ సంస్థలతో పాటు ప్రైవేటు రంగ సంస్థలు కూడా పాల్గొంటాయన్నారు. సింగరేణిలో రాష్ట్రప్రభుత్వం వాటా 51శాతం, కేంద్రప్రభుత్వం వాటా 49 శాతం ఉండ గా కేంద్రం సంస్థ ఎలా ప్రైవేటీకరించగలమన్నారు.