నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను రెండవ శనివారం రోజున పురస్కరించుకుని రేపు సెలవు రద్దు చేయడం జరిగిందని పాఠశాలలు యధావిధిగా పని చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రభుత్వ ప్రకటించిన క్యాలెండర్ సెలవులు తగ్గిన నేపథ్యంలో శనివారం యధావిధిగా పాఠశాలల నిర్వహణ ఉంటుందని ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లాలని సూచించారు.