calender_icon.png 10 January, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాయత్రిని మించిన శక్తి లేదు

07-01-2025 12:00:00 AM

కోరుట్ల, జనవరి 6: ఈ సృష్టిలో గాయ త్రిని మించిన శక్తి మరొకటి లేనేలేదని బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ అన్నారు. కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ‘అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం’లో భాగంగా సోమవారం బ్రహ్మవైవర్త మహా పురాణ సప్తాహ ప్రవచనం భక్తులను అలరించింది. ప్రాచీన సంస్కృత ప్రాక్భా షలో గాయత్రి అనే ఒక చంధస్సు ఉండేదని, దాని ఆధారంగానే గాయత్రి మంత్రం ఉద్భ వించిందన్నారు.

  ఏ యజ్ఞ యాగాలు చేసి నా, ఏ నోములు పూజలు నోచినా గాయత్రి మంత్రంతోనే అవి పరిపూర్ణమని స్వామి పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, చైర్మన్ శ్రీనివాస్, కన్వీనర్ రాజేంద్రప్రసాద్, నిర్వాహకులు ప్రభాకర్, శ్రీనివాసరావు, చం ద్రం, రాజలింగం, శ్రీనివాస్ పాల్గొన్నారు.