calender_icon.png 10 January, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టపైకి అనుమతి లేదు

31-12-2024 01:21:52 AM

కరీంనగర్, డిసెంబర్30(విజయక్రాంతి): కరీంనగర్ కమీషనరేటులో డిసెంబర్ 31 నాడు నూతన సంవత్సర కోసం జరుపుకునే వేడుకల సందర్బంగా ఎటువంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండా  కరీంన గర్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.

దానిలో భాగంగా 31వ తేదీ మంగళవారం సాయంత్రం 06:00 గంటల నుండి జనవరి 01వ తేదీ సోమవారం ఉదయం 05:00 గంటల వరకు కరీంనగర్ పట్టణ శివారు లోని తీగల వంతెన మరియు లోయర్ మా నేరు డాం కట్టపైకి వెళ్ళుటకు అనుమతిం చబోమని, అక్కడ వేడుకల నిర్వహించుట నిషేదించడమైనదని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి   తెలిపారు.

అంతేకాకుండా రోడ్లమీద కూడా ఎటువంటి వేడుకలు నిర్వహించుటకుగాని, డీజేలను వినియోగించడం నిషేదాజ్ఞలు ఉన్నాయన్నా రు. బైక్ సైలెన్సర్లను మార్చి శబ్దకాలుష్యం చేస్తూ రోడ్లపై తిరగడం, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టు బడిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తూ, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాలు లేదా ప్రజాశాం తికి భంగం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చాలా కఠినంగా వ్యవహరించడంతోపాటు నూతన చట్టాలక నుగుణంగా పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పై విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కమీషనరే ట్ పరిధిలోని ప్రజలు ప్రశాంత వాతావర ణంలో చట్ట పరిధిలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.