03-03-2025 01:42:24 AM
నిరంతరం ధరణి సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు
వచ్చి ఎవరూ లేరని అసహనంతో వెనుతిరుగుతున్న రైతులు
మహబూబ్‌నగర్ మార్చి 2 (విజయ క్రాంతి) : ధరణిలో భూ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. కేవలం సోమవారం తప్ప ఇతర రోజులలో హెల్ప్ డెస్క్ లో సిబ్బంది ఉండడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు పని దినాలలో హెల్ప్ డెస్క్ లో సిబ్బంది అందుబాటులో ఉంచి ధరణి లోని భూ సమస్యలు ఉన్న రైతులకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించేలా ఉన్నతాధికా రులు చర్యలు తీసుకున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్య ధోరణి గా వ్యవహరిస్తున్నారని పలువురు భూ సమస్యలతో వచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే హెల్ప్ డెస్క్‌లో నిరంతరం సమయం పాలన మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.