calender_icon.png 18 January, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ రోజూ ధర్నా చేసినా అభ్యంతరం లేదు

18-01-2025 01:06:40 AM

  1. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ దేశాన్ని అవమానిస్తున్నాడు 
  2. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ కాపాడిన ధర్నాచౌక్‌లో మాజీ మంత్రి కేటీఆర్ రోజూ ధర్నా చేసినా తమకు అభ్యంతరం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఎద్దేవాచేశారు. అధికారంలో ఉన్నప్పుడు ధర్నాచౌక్ ను ఎత్తివేసి.. ఇప్పుడు అక్కడనే ధర్నాలు చేస్తున్నారని చెప్పారు.

శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలపై ఢిల్లీలో మాట్లాడితే బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని, కేటీఆర్‌కు దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడాలన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను అవమానిస్తే.. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ భారతదేశాన్నే అవమానిస్తున్నాడని మండిపడ్డారు. 

కేటీఆర్ నార్కోడ్రగ్ టెస్టు చేయించుకోవాలి: లింగంయాదవ్ 

మాజీ మంత్రి కేటీఆర్ ముందుగా నార్కోటిక్ డ్రగ్ టెస్టు చేయించుకోవాలని, ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి లైడిటెక్టర్ టెస్టుకు వస్తారని పీసీసీ అధికార ప్రతినిధి లింగంయాదవ్ సవాలు విసిరారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రైతుల పేరుతో కేటీఆర్ మరోసారి దొంగ దీక్ష చేస్తున్నాడని విమర్శించారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.