వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి
ముషీరాబాద్, అక్టోబర్ 10: ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహాన్ని తగ్గించుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి.చెన్నయ్య, కో చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న) అన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మా ట్లాడుతూ.. వర్గీకరణ విషయంలో నోరు విప్పని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన పదవికి రాజీనామా చేయాలన్నారు. సమితి నాయకులు రాంప్రసాద్, లింగస్వామి, శ్రీనివాస్, కిషన్, వినోద్ కుమార్, శ్రీరంగా, అనిల్ తదితరులు పాల్గొన్నారు.