calender_icon.png 4 February, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యం తగదు: కలెక్టర్ విజయేందిర బోయి

04-02-2025 12:59:05 AM

 మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి) : ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్ల క్ష్యం ఎట్టి పరిస్థితిలో తగదని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం నిర్వహిం చిన ప్రజావాణి కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పిం చారు. 

కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యల ను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో నూలు పురుగుల నివారణ మాత్రలు సంబంధించి ప్రత్యేకంగా కలెక్టర్ విజయేందిర బోయి సమావేశం నిర్వహించారు. 

జిల్లాలో 1-19 సంవత్సరాల లోపు పిల్లలందరికి తప్పనిసరిగా ఆల్బెండ జోల్ మాత్రలను ఇవ్వాలని పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీన ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అర్హులైన అందరికీ పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.