calender_icon.png 26 April, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్కృతాన్ని ప్రోత్సహించే ఉద్దేశం లేదు

26-04-2025 12:57:32 AM

తెలుగుపై గౌరవం, అభిమానం ఉంది

ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆర్జేడీ జయప్రద బాయి

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతంను ప్రోత్సహించే ఉద్దేశం లేదని ఇంటర్మీడియట్ విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ జయప్రద బాయి తెలిపారు. తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతం సబ్జెక్టును ప్రవేశపెడుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తి గా అవాస్తవమన్నారు. ఇంటర్‌లో ద్వితీయ భాష గా తెలుగుకి సముచిత స్థానముండాలని కోరు తూ శుక్రవారం సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన అధ్యాపకులు ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య, రీజినల్ జాయింట్ డైరెక్టర్ జయప్రద బాయికి వినతి పత్రం సమర్పించారు.

దీనిపై స్పష్టతనిస్తూ జయప్రద అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పది సంస్కృతం పోస్టులను భర్తీ చేయడం కోసం ఏయే కాలేజీల్లో ఖాళీలున్నాయో, విద్యార్థులు ఎంతవరకు సంస్కృతం సబ్జెక్టును ఎంపిక చేసుకుంటు న్నారనే వివరాలను ప్రిన్సిపాల్స్ నుంచి సమాచారం తెప్పించుకొని మెమో రూపంలో గతంలోనే విడుదల చేసినట్టు గుర్తుచేశారు. తెలుగుపై ఇంటర్మీడియట్ విద్యాశాఖకు గౌరవం, అభిమానం ఉన్నాయన్నారు. 60 తెలుగు పోస్టులను నూతనంగా భర్తీ చేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర అధికార భాషగా తెలుగును నిలబెట్టడం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు.