సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రపంచానికి కమ్యూనిస్టు బాట వేసి, సమ సమాజ నిర్మాణానికై విప్లవ పోరాటాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు కామ్రేడ్ లెనిన్ అని సీపీఐ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా సీపీఐ కార్యాలయంలో మంగళవారం కామ్రేడ్ లెనిన్ 101 వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కామ్రేడ్ లెనిన్ కరల్ మార్క్స్ రాసిన కమ్యూనిజం సిద్ధాంతంను పాటిస్తూ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని 1917లో రష్యాలో స్థాపించడం జరిగిందని గుర్తు చేశారు. కారల్ మార్క్స్ అడుగుజాడల నడుస్తూ ప్రపంచానికి లెనిన్ మార్గదర్శకంగా నిలిచరన్నారు. ప్రపంచంలోనే లెనిన్ ను మించిన పోరాటయోధుడు ఇక పుట్టలేరని అలాంటి మహనీయుని బాటలో నడిచి వారి ఆశయాలు నెరవేర్చలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ్ కుమార్, కుంటల రాములు తదితరులు పాల్గొన్నారు.