calender_icon.png 17 January, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజభోగాలు అనుభవించడానికి నీలాగా ఫాంహౌస్ లేదు

25-08-2024 01:58:17 AM

  1. జన్వాడ ఫామ్‌హౌస్ బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌దే 
  2. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్

ఎల్బీనగర్, ఆగస్టు 24: ‘రాజభోగాలు అనుభ వించడానికి నీలాగా నాకు ఫాం హౌస్ లేదు కేటీఆర్. వారానికి నాలుగుసార్లు జన్వాడకు  ఎంజాయ్ చేయడా నికి వెళ్తావ్. నీలాగా బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టలేదు. జనంలో తిరిగేవాడిని, నేను సామాన్యుడిగానే ఉంటా’ అని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ నిప్పులుచెరిగారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ తనపై చేసిన ఆరోపణల పై మధుయాష్కీ శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహించారు.

నిబంధనలను తుంగలో తొక్కి 111 జీవోకు వ్యతిరేకం గా బినామీ పేరుతో ఫాంహౌస్ నిర్మిం చి, ఇప్పుడు తనది కాదని కేటీఆర్ చెప్ప డం హాస్యాస్పదమ ని ఎద్దేవాచేశారు. తనకు గండిపేట దగ్గర మామిడి, సపో ట తోటలు ఉన్నాయని, అది నిజమేన ని.. అక్కడ వాచ్‌మన్ కుటుంబం ఉండడానికి చిన్న ఇల్లు మాత్రమే ఉందని తెలిపారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో వ్యవసాయం లేదా తోటల పెంపకం చేపట్టవచ్చనే విషయంగా కేటీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.