జిల్లా కేంద్రంలో విద్యుత్ దీపాలు వెలుగని పరిస్థితి...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పేరు పెద్ద ఊరు దెబ్బ అన్నచందంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పనితీరు ఉంది. నిత్యం రద్దీగా ఉండే రహదారి గుండా విద్యుత్ దీపాలు అమర్చకపోవడంతో ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాత కలెక్టరేట్ కార్యాలయం నుండి బాబా పూర్ చౌరస్తా వరకు విద్యుత్ దీపాలు అమర్చకపోవడంతో రాత్రి సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దారిలో అటవీశాఖ కార్యాలయం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహం, పిటిజి గురుకులం, గిరిజన బాలికల గురుకుల పాఠశాల, ఫారెస్ట్, అగ్నిమాపక, తహసిల్దార్, ఆర్డీవో, జిల్లా పరిషత్, జిల్లా పోలీస్ కార్యాలయాలతో పాటు కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు విద్యుత్ దీపాలు అమర్చడంలో నిర్లక్ష్యం వహించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన దారిలోనే విద్యుత్ దీపాలు లేకపోతే వార్డులలో ఏ మేరకు ఏర్పాటు చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు రాత్రి సమయంలో వివిధ ప్రాంతాలకు పర్యటన చేసి ఆ రోడ్డు గుండా వస్తున్నప్పటికీ వారు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెలివెత్తుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, రాత్రి సమయాల్లో వాకర్స్ వాకింగ్ చేయడం జరుగుతుంది. చీకట్లో వాకింగ్ చేసే సమయంలో ఏదైనా విష పురుగు పుట్టితే వారి బాధ్యత వహిస్తారని వాకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విద్యుత్ దీపాలు అమర్చాలని డిమాండ్ చేస్తున్నారు.