calender_icon.png 6 March, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో తాగునీటి సమస్య లేదు

03-03-2025 12:00:00 AM

పత్రికా కథనాల్లో వాస్తవం లేదన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 

ఎల్లారెడ్డిపేట, మార్చి 2: రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రాగు నీటికి ఎక్కడ ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నా రు. ఆదివారం వచ్చిన పత్రిక కథనాలపై  జిల్లా కలెక్టర్ స్పందించారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూర్ పల్లి తండాలో మిషన్ భగీరథ త్రాగునీరు అందడం లేదని ప్రచురించిందని, ఇందులో వాస్తవం లేదని, సత్య దూరం అని తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండ లం బాకూర్ పల్లి తండాలో మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీటి సరఫరా సజావుగా జరుగుతుందని, ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా నీటి సరఫరా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఎటువంటి కొరత లేదని తెలిపారు.