calender_icon.png 5 January, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. అరాచక పాలన

03-01-2025 02:18:21 AM

బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి 

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. అరాచక పాల న నడుస్తున్నదని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో గు రువారం ఆయన మీడియాతో మా ట్లాడుతూ.. కొత్త సంవత్సరంలోనైనా  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆకాంక్షిం చారు.

ప్రతిపక్షాల గొంతునొక్కాలనే ప్రయత్నాలను రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా వదిలివేయాలని హితవు పలి కారు. రైతుభరోసా ఇస్తామని చెప్పి సర్కార్ రైతులను మోసం చేసిందన్నారు. అసలు రైతులకే దిక్కులేదని, పైగా కౌలు రైతులకూ పెట్టుబడి సాయం అందిస్తామని బీరాలు పలికారని గుర్తుచేశారు. రైతు కూలీలకూ ఏం సాయం చేస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రైతుభరోసాపై మంత్రివర్గ సబ్ కమిటీ ఎందుకు నివేదిక ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం అందకపోతే కౌలు రైతులు ఎక్కువగా ఇబ్బంది పడతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని దాటి  రూ.1,38,117 కోట్ల అప్పు చేసిందని, ఈ లెక్కన రోజుకు రూ.354 కోట్లు, ప్రతి గంట కు రూ.14.75 కోట్ల అప్పు చేసినట్లవుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు రూ.30 వేల కోట్ల అప్పు కోసం భూములు తాక ట్టు పెట్టారని స్పష్టం చేశారు. అర్హులందరికీ రుణమాఫీ చేశామని కాం గ్రెస్ పెద్దలు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి రాష్ట్రంలో 60 నుంచి 65శాతం మాత్రమే రుణమాఫీ అ యిందని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధికి ఎంపిక ఎలా ఉంటుందనే అంశంపై సర్కార్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.