కిసాన్‌సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నర్సింహరెడ్డి
సిద్దిపేట, మే17 (విజయక్రాంతి): అకాల వర్షాలకు రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగో లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ కిసాన్‌సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నర్సింహరెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో జాప్యం లేదని చెప్పారు. సీఎం మాట ఇచ్చి న విధంగా ఆగస్టు 15లోపు రూ. 2 లక్షల రుణమాఫి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని అధికారుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు కొను గోలు చేస్తున్నారని చెప్పారు.
వర్షాలకు వడ్లు తేమా శాతం అధికంగా ఉంటుంది కాబట్టి అధికారులు జోక్యం చేసుకొని కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. వర్షకా లం పంటల సాగుకు నాణ్యమైన విత్తనాలు, అవసరమైన ఎరువులను అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు సంబంధించిన ప్రతి అవసరాన్ని సమకుర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మునుముందు చర్యలు చేపడుతున్నదన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు రైతులను వాడుకుని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సమావేశం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్‌సెల్ నాయకులు కొడారి మల్లారెడ్డి, నాయకులు చెంది సత్యనారాయణ, ఖాతా రాజీరెడ్డి, మార్క చంద్రశేఖర్ పాల్గొన్నారు.