calender_icon.png 13 January, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంటగ్యాస్ కేవైసీకి గడువు లేదు

10-07-2024 12:05:00 AM

ఈ కేవైసీపై కేంద్రం స్పష్టత 

న్యూఢిల్లీ, జూలై 9: వంటగ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఈ కేవైసీ చేసుకొనేందుకు ఎలాంటి తుది గడువు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ కేవైసీని వినియోగదారులు సొంతంగా కూడా చేసు కోవచ్చని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురి సోమవారం వెల్లడించారు. ఈ కేవైసీపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కేరళ నేత వీడీ సతీశ్‌న్ లేఖ రాయటంతో హర్దీప్‌సింగ్ దీనిపై స్పష్టత ఇచ్చారు. ఈ కేవైసీ గత ౮ నెలలుగా కొనసాగుతున్నదని, నకిలీ కస్టమర్లను ఏరివేసేందుకే ఈ ప్రక్రియను చమురు మార్కెటింగ్ సంస్థలు చేపట్టినట్టు వెల్లడించారు.

ఎల్పీజీ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో వారి ఇంటివద్దనే సిబ్బంది కస్టమర్ల వివరాలు సేకరించి మొబైల్‌లోని ఫోన్ యాప్‌లో నమోదుచేస్తారని తెలిపారు. లేదంటే కస్టమర్లు వారి డిస్ట్రిబ్యూటరీ షోరూం వద్దకు వెళ్లి కేవైసీ చేయించుకోవాలని, అదీ కాకుంటే కస్టమర్లు స్వయంగా తమ మొబైల్ యాప్స్‌లో కంపెనీల యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని స్వయంగా ఈ కేవైసీ చేసుకోవచ్చని సూచించారు. ఈ ప్రక్రియను పూర్తిచేయటానికి ఎలాంటి చివరి గడువు లేదని స్పష్టంచేశారు.