న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప కోటాలు ఏర్పాటుచే యాలన్న సుప్రీంకోర్టు తీర్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. రిజర్వేషన్ల వర్గీకరణ జరిగినా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ విధానం ఉండబోదని సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం కేంద్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఈ వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ ఉండాలని చెప్పలేదని, రాజ్యాంగ నియమాలను ఎన్డీయే ప్రభుత్వం సంపూర్ణంగా పాటిస్తుందని తెలిపారు.