calender_icon.png 23 January, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలో దగ్గు, సర్ది మందులు లేవు

23-01-2025 06:44:35 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న ప్రజలకు అవసరమయ్యే మందులను ప్రభుత్వ ఆసుపత్రిలో సరఫరా చేయకపోవడంతో ఖానాపూర్ పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఖానాపూర్ పట్టణంలో ఉన్న సామాజిక ఆసుపత్రిలో ఖానాపూర్ పెంబి కడెం దస్తురాబాద్ మండలం చెందిన రోగులు వస్తున్నప్పటికీ ఈ సీజన్లో చలి తీవ్రత కారణంగా దగ్గు, సర్ది ఇతర జ్వరాలు రావడంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తున్నట్లు రోగులు తెలిపారు. ఆసుపత్రిలో రోగులను పరీక్ష చేస్తున్న వైద్యులు ప్రభుత్వ మందులను ఉచితంగా అందించవలసి ఉన్న దగ్గు సర్దికి ఉపయోగపడే మందులు లేకపోవడంతో బయట నుండి కొనుగోలు చేయాలని రోగులకు వైద్య సిబ్బంది సూచిస్తున్నట్లు పలుగు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకంతో వస్తున్న అక్కడ కూడా మందులు దొరకపోవడంతో బయట మందులు కొనుక్కోలేని పరిస్థితి ఉన్న పేదలు రోగాలతో సతమతమవుతున్నారు. ప్రతిరోజు ఈ ఆసుపత్రికి 100 వరకు పేషెంట్లు వస్తున్నప్పటికీ వారికి అవసరమయ్యే మందులు లేక వెనుతిరిగి పోతున్నారు.