09-02-2025 12:00:00 AM
హర్ష గంగవరపు, లతా విశ్వనాథ్, ఇనయా సుల్తానా ప్రధాన పాత్రల్లో ఏకైవ హోమ్స్ బ్యానర్‌పై సూర్యదేవర రవీంద్రనాథ్, రమేశ్‌బాబు కోయ నిర్మించిన చిత్రం ‘మదం’. ఈ చిత్రానికి వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. మార్చి 14న రిలీజ్ చేయబోతున్న సందర్భంగా టీజర్‌ను ‘తండేల్’ సినిమాతోపాటు థియేటర్లలో యాడ్ చేశారు.
ప్రస్తుతం ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తుండటంతో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీకృష్ణ మల్లా మాట్లాడుతూ.. ‘నిర్మాత రమేశ్ ఇచ్చిన కథను చూసినప్పుడు నాకు చాలా భయమేసింది. ఇంతటి రా, రస్టిక్ సినిమా తెలుగులో రావడం అరుదు. తమిళ్, మలయాళీ భాషల్లో ఇలాంటి కంటెంట్ వస్తుంటుంది.
కథ నాకు చాలా నచ్చింది. ఇలాంటి క్ల్లుమాక్స్ ఇప్పటివరకు ఇండియన్ సినీ హిస్టరీలో రాలేదు. ఈ మూవీని చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి’ అన్నారు. ఇనయా సుల్తానా, రైటర్ రమేశ్‌బాబు కోయ, హర్ష గంగవరపు, లతా విశ్వనాథ్ పాల్గొన్నారు.