22-04-2025 02:08:35 AM
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తుందని బీజేపీ ఎంపీ, బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. సోమవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆర్ కృష్ణయ్య విద్యార్థుల కోర్ కమిటీ మీటింగ్‌లో పాల్గొన్నారు. 16.75 లక్షల మంది విద్యార్థుల ఫీజులు చెల్లించాలని ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీవో, తాసీల్దార్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు.
ఒక్క కాంట్రాక్టర్‌కు ఇచ్చే బిల్లుతో 14 లక్షల మంది విద్యార్థుల స్కాలర్‌షిప్స్ చెల్లించవచ్చని తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రికి కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుంటే తిరుగుబాటు తప్పదని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.