calender_icon.png 30 October, 2024 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

01-08-2024 01:22:59 PM

మహిలాలోకానికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మ దహనానికి బిఆర్ఎస్ యత్నం

భగ్నం చేసిన పోలీసులు

ఇరు వర్గాల మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తత

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డిని అవమానిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ గురువారం బిఆర్ఎస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ బిఆర్ఎస్ కార్యకర్తలు బస్టాండ్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. దాన్ని ముందే ప్రతిఘటించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన బిఆర్ఎస్ నేతల నుండి దిష్టిబొమ్మను లాక్కున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బిఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం తోపులాట చోటుచేసుకుంది. అనంతరం వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ముఖ్య నేతలు మాట్లాడుతూ మహిళల్లోకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.