calender_icon.png 2 November, 2024 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిఐతో ప్రాణభయం ఉంది

18-07-2024 10:03:42 PM

  • చీటకొడురు పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి

జనగామ, జూలై 18 (విజయ క్రాంతి): భూ విభాగంలో జోక్యం చేసుకొని తనను జనగామ సిఐ రఘుపతి రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆయనతో తనకు ప్రాణహాని ఉందని చీటకోడూరు పీఏసిఎస్ చైర్మన్  చిర్ర శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. గురువారం జనగామ మండలం ఏర్రగొల్లపహడ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు సంబంధించిన మూడు ఎకరాల భూమిని హనుమంత రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి తన వద్ద కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ సీఐ హనుమంత రెడ్డికే మద్దతు గా పనిచేస్తున్నారని ఆరోపించారు. తనకు మద్దతుగా ఉన్న 9 మందిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. సీఐ తీరుపై పోలీసు ఉన్నతాధికారులతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.