calender_icon.png 5 February, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు సాయం చేసేంత డబ్బుంది..

21-01-2025 01:48:38 AM

సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ప్రతి ఒక్కరూ అత్యంత ఇష్టపడే హీరోయిన్లలో తొలి స్థానంలో ఉంటుందీ భామ. గ్లామర్ పాత్రల జోలికి వెళ్లదు.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటుంది.. అలాగే పాత్రలో జీవిస్తుంది. ఈవెంట్ ఏదైనా పద్ధతిగా చీరలో కనిపిస్తుంది.. అందుకేనేమో యూత్ నుంచి పెద్దవాళ్ల వరకు అంతా ఈ ముద్దుగుమ్మను ఇష్టపడతారు.

గౌరవంగా చూస్తారు. ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్ ‘రామాయణం’లో సీతగా నటిస్తోంది. ఈ సినిమాతోనే సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇటు టాలీవుడ్‌లో ‘తండేల్’ చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తనకు చిన్ననాటి నుంచి సాయం చేయాలని ఉండేదని.. అప్పట్లో డబ్బు ఉండేది కాదని చెప్పుకొచ్చింది. “నా చిన్నతనంలో మా కుటుంబంలో మేమే ధనవంతులం అనుకునేదాన్ని కానీ అప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు. కానీ ఇప్పుడు పేదలకు సాయం చేయడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉంది’ అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ఆమె మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.