calender_icon.png 29 March, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో స్మశాన వాటికల కొరత తీవ్రంగా ఉంది

23-03-2025 12:00:00 AM

  1. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  2. ముషీరాబాద్‌లో రూ. 96 లక్షలతో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
  3. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, మార్చి 22: (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో స్మశాన వాటికల కొరత తీవ్రంగా ఉంది. ఉన్నవాటిలో మౌలిక సదుపాయాలు కల్పించి పేద మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిహెచ్‌ఎంసి అధికారులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

శనివారం సాయంత్రం ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్ లో గల హిందూ స్మశాన వాటికలో రూ.32 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు, అడిక్మెట్ డివిజన్లోని నాగమయ్యకుంటలో రూ. 44 లక్షల వ్యయంతో సీవరేజ్ నిర్మాణ పనులు, గాంధీనగర్ లో ని అరుంధతి నగర్ లో రూ. 20 లక్షల వ్యయం తో తాగు నీరు పైప్ లైన్, వీడీసీసీ నిర్మాణ పనులను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అడిక్మెట్ కార్పొరేటర్ రవి చారి, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, గాంధీనగర్ కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్, జిహెచ్ ఎంసి, జలమండలి అధికారులతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ లు ప్రారంభించారు.

అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఉన్న ఉన్నటువంటి స్మశాన వాటికల పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యచరణ రూపొందించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు కేటా యించాలని డిమాండ్ చేశారు. స్మశాన వాటికల కొరతల వల్ల కొన్నిచోట్ల స్థానిక ప్రజల మధ్య ఘర్షణలు సైతం జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి డిఇలు  సన్నీ, గీత కుమారి, జలమం డలి డీజీఎంలు కార్తీక్‌రెడ్డి మోహన్ రెడ్డి, బిజెపి ముషీరాబాద్ నియోజకవర్గం ఇన్చా ర్జి రమేష్ రామ్, జాయింట్ కన్వీనర్ ఎం నవీన్ గౌడ్, టిఆర్‌ఎస్ సీనియర్ యువ నాయకుడు ముఠా జై సింహ, బిజెపి ఏపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.