calender_icon.png 6 April, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి విద్యార్థులో ఓ శాస్త్రవేత్త దాగి ఉన్నాడు

05-04-2025 11:44:29 PM

స్పేస్ ఎక్స్ పో  ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న శాస్త్రవేత్తను వెలికి తీయడానికి ’స్పేస్ ఎక్స్ పో’ దోహదం చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రపంచంతో పోటి పడుతుందని, ఆ సంస్థ నేతృత్వంలోని జాతీయ రిమోట్ సెస్సింగ్ సెంటర్ సహకారంతో విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టడం అభినందనీయమన్నారు. శనివారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి కాటేదాన్ శాంతి నగర్ లోని రవిస్ బ్రిలియంట్ స్కూల్ ఆవరణలో జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్, కెఐ ల్యాబ్ సహకారంతో ఏర్పాటు చేసిన స్పెస్ ఎక్స్ పోను ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం అధ్యక్షుడు ఎస్.ఎన్. రెడ్డి, రాజేంద్రనగర్ మండల అధ్యక్షుడు ప్రభాకరాచారి, పాఠశాల వ్యవస్థాపక డైరెక్టర్ ఎస్.ఆర్. కస్తూరి బాయ్, కరస్పాండెంట్ ఎస్.ఆర్. రజినీకాంత్ తదితరులతో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బిఎస్‌ఎల్వీ-1,2,3,4, ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిదన్నారు. ఆ సంస్థ తయారు చేసిన పలు శాటిలైట్లు దేశానికి ఎంతో ఉపకరిస్తున్నాయన్నారు. చంద్రయాన్ వంటి ప్రయోగం ఇస్రో విజయంతం చేయడం మనందరికి తెలిసిందేనని గుర్తు చేశారు. చంద్రుడు ఎలా ఉంటాడు. అక్కడికి పంపే ఉపగ్రహాల తీరుతెన్నులు విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో ప్రదర్శనలో ఉంచిన నమూనలు ఆలోచింప జేస్తున్నాయని చెప్పారు. అంతకు ముందు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేంట్ పాఠశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్. రెడ్డి, రాజేంద్రనగర్ మండల అధ్యక్షుడు ప్రభాకరాచారి మాట్లాడుతూ.. బడ్జెట్ పాఠశాలల్లో విద్యార్థులను అన్ని విధాల చైతన్యపరుస్తు విద్యాబోధనలు జరుగుతాయని గుర్తు చేశారు. ఒక సైన్స్ ప్రయోగం చేయాలంటే ఏవిధమైన పరిరకాలు సిద్ధం చేసుకోవాలో, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ స్పెస్ ఎక్స్ పో విద్యార్ధుల మెదళ్ళలో నాటుకు పోయోలా రవిస్ బ్రిలియంట్ స్కూల్ నిర్వాహకులు కృషి చేయడం అభినందనీయమన్నారు.