calender_icon.png 20 October, 2024 | 3:59 PM

ఇందిరమ్మ కమిటీలో కష్టపడ్డ కార్యకర్తలకు చోటు

20-10-2024 11:53:17 AM

పదవుల్లో ఉన్న వారికి  కమిటీలో చోటు లేదు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల సమావేశంలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు

మంథని (విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీ నియమాకాలలో కష్టపడ్డ కార్యకర్తలకు చోటు కల్పించాలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంంథని బ్లాక్ కాంగ్రెస్, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులతో మంత్రి ఇందిరమ్మ కమిటీ ఎన్నికపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదవుల్లో ఉన్న వారికి ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించవద్దని, ఈ కమిటీలో ఉన్న వారికి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇందిరమ్మ కమిటీలో సభ్యులుగా నియమించవద్దని ఒకవేళ నియమిస్తే వాటిని రద్దు చేసి మళ్ళీ కొత్త కమిటీలను నియమించాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారికి ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించాలని, ఈ నెలాఖరులో మంథని నియోజకవర్గానికి 4,000 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని, నిజమైన ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగులని మంత్రి అదేశించారు. ఈ కార్యక్రమంలో మంథని, కాటారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, కోట రాజబాబు, మంథని నియోజకవర్గంలోని మండలాధ్యక్ష్యులు ఐలి ప్రసాద్, రొడ్డ బాపు, వైనాల రాజ్, దొడ్ల బాలాజీ, వేమునూరి ప్రభాకర్ రెడ్డి, గుండబోయిన చిన్నాన్న, పక్కల సడువలి, అక్బర్ ఖాన్, బడితల రాజయ్యలు పాల్గొన్నారు.