ఇల్లే ఒక లైబ్రరీ.. బాల్యంలో ప్రతి విషయాన్ని ఇంటి వాతావరణమే నేర్పుతుంది. పిల్లలు ఆడుకోవడానికి ఒక ఆట స్థలం.. తినడానికి డైనింగ్ టేబుల్.. పడుకోవడానికి బెడ్‌రూమ్ ఉన్నట్టే.. చదువుకునేందుకు కూడా ఓ ప్రత్యేకమైన స్థలం కేటాయించాలి అంటున్నారు మానసిక నిపుణులు. కంటికి ఇంపైన రంగు, ఆహ్లాదకరమైన సంగీతం, చక్కటి సువాసన ఏకాగ్రత పెంచుతాయి. కాబట్టి చిన్నారులు చక్కగా చదువుకునేందుకు రీడింగ్ నూక్స్ ఏర్పాటు చేస్తే మంచిదంటున్నారు నిపుణులు.
చిన్నతనం నుంచే పుస్తకాలు చదివే అలవాటు చేయాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం మంచి మంచి పుస్తకాలు కొనివ్వడమే కాదు, పిల్లలు ఓ దగ్గర ప్రశాంతంగా కూర్చుని చదువుకునేలా తగిన ఏర్పాట్లు చేయాల్సిందే. ఉన్న చిన్న ఇంట్లోనే ఆ సౌకర్యం కావాలంటే ఈ రీడింగ్ నూక్స్‌ను ప్రయత్నించొచ్చు.
ఖాళీ సమయాల్లో నచ్చిన పుస్తకాలు చదువు కోవాలన్నా, కాలక్షేపానికి పత్రికలూ, పజిల్ బుక్స్ లాంటివి తిరగేయాలన్నా అందుకు ఇవి సరిగ్గా సరిపోతాయి. ఇంకా పరీక్షలప్పుడూ వీటిల్లో కూర్చుని ఏకాగ్రతతో చదువుకోవచ్చు. ఎన్నెన్నో ఆకారాల్లో ఆకట్టుకునే వీటి లోపల పుస్తకాలు పెట్టుకోవడానికి అరలూ, కూర్చో డానికి మెత్తటి పరుపుల్లాంటివీ అందమైన అమరికల్లో ఉంటాయి.
కంటికి ఇంపైన రంగు, ఆహ్లాదకరమైన సంగీతం, చక్క టి సువాసన ఏకాగ్రత పెంచుతా యి. ముదురు రంగులు, రాక్ సంగీతం, ఘాటైన వాసనలూ ప్రతికూలమైనవి. చదువుకోడానికి కూ ర్చునే ముందే ఆ ప్రదేశాన్ని చక్కగా సర్దుకోవాలి. పిల్లలు ఇష్టపడితే ఏ పని అయినా బాగా చేయగల రనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చాలావరకూ అన్నీ వాళ్లకు నచ్చినట్టే ఉండేలా చూసుకుంటారు.
అది తినే తిండి కావచ్చు.. పడుకునే మంచమైనా కావచ్చు.. మామూ లుగా వాడుకునే ఈ వస్తువుల్లోనే అంత శ్రద్ధ చూపిస్తే.. చదువు విషయంలో ఇంకెంత ఆలోచిస్తారు. అందుకు పరిష్కారం చూపిస్తూనే హోంవర్కులు చేసుకోవడానికీ, ఇష్టమైనవి చదువుకోవడానికి వీలుగా రకరకాల స్టడీ టేబుళ్లు, రీడింగ్ నూక్స్‌లాంటివెన్నో వచ్చాయి.
హాల్లో కిటికీ దగ్గరో, ఇంట్లో ఓ మూలకో, రెండు గదుల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోనో, మెట్ల కిందనో.. ఇలా ఎక్కడైనా ఈ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటీరియల్‌కు తగ్గట్టు ఉన్న ఆ కొంచెం స్థలంలోనే చదువుకోవడానికీ, పుస్తకాలు పెట్టుకోవడానికి సరిపోయేలా తీర్చిదిద్దుకోవచ్చు.
ఆహ్లాదకరంగా కనిపించడానికి నచ్చిన బొమ్మల థీముల్లో వాటికి పెయింటిం గ్స్ వేసుకోవచ్చు. ఇలా ముందుగానే ఇంటి గోడలకు కలిపి కట్టుకోవడమేకాదు, విడిగా ఈ రీడింగ్ నూక్స్ సెటప్స్ కూడా దొరుకుతున్నాయి. రకరకాల బొమ్మల ఆకారా ల్లోని వీటిల్లో చి న్నారులు మెచ్చినదాన్ని తెచ్చుకుని కావాల్సిన చోట పెట్టుకోవచ్చు.
చదువుకునే చోటు ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తగినంత గాలీ, వెలుతురూ ఉండాలి. ట్యూబులైట్ల వెలుగు మొహం మీద పడకుండా చూసుకోవాలి. పుస్తకం మీదకి నీడ రాకూడదు. చదువుకు అవసరమైన సామగ్రి అంటే పెన్నులు, మార్కర్లు తదితరాలు అందుబాటులో ఉండాలి.
ఎత్తుకు తగిన కుర్చీ, టేబుల్ ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి బాగా నిద్రపోయి లేస్తే ఉదయం శరీరం, మనసు, మెదడు చురుగ్గా ఉంటాయి. అప్పుడు కొత్త విషయాలను
సులువుగా నేర్చుకోవచ్చు.