25-03-2025 12:16:50 AM
చేపల మార్కెట్ కోసం వినతి
కల్లూరు, మార్చి 24 :-కల్లూరు చేపలకు గిరాకీ ఎక్కువకావడంతో మండల పరిసర ప్రాంతాల నుండి,ఆంధ్రా సరిహద్దు ప్రాం తాల నుంచి కల్లూరు కి ప్రజలు పోటెత్తుతున్నారు. వేసవి కావడంతో మండలంలో చేపలను విక్రయాలు ఊపందు కున్నాయి. వైరస్ వల్ల చికెన్ కొనుగోళ్లు పడిపోయి గిరాకీ తగ్గి చేపలకు డిమాండ్ పెరగడంతో చేపలు ఎక్కువగా తినటానికి ఇష్టపడుతున్నారు.
కల్లూరు మార్కెట్లో ఎక్కువగా బొచ్చె రకం దొరుకుతుంది.ఈ రకం కిలో రూ.150 నుండి 200 వరకు పలుకుతుం ది. శీలావతి కేజీ 150 నుండి 180 వరకు, కొర్రమేనూ 200 నుండి 300 వరకు రేట్లు ఉన్నాయి.సీజన్ను బట్టి చేపలు అమ్ముతున్నారు.అయినా విని యోగదారులు మా త్రం రేట్లు లెక్క చెయ్యకుండా చేపలను కొనుగోలు చేస్తున్నారు.
పచ్చి చేపలలో ఒమే గా-3,ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు చాలా మంచివి. పచ్చి చేపలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుం ది. చేపల్లో ఒమే గా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఏ,డీ,కే, బి12 విటమిన్లతో పాటు జింక్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, అయోడిన్, కాపర్ వంటి ఖనిజాలతో పాటు సెలీనియం పోషకాలు అధిక మొ త్తంలో లభిస్తుండడం తో మండలంలో చేపలు విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. అయితే స్థానికంగా మార్కెటింగ్ వసతులు లేకపోవడం వల్ల చేపలు విక్రయదారులు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మార్కెట్ వసతి ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.