calender_icon.png 25 November, 2024 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు జాప్యంలో కుట్ర దాగి ఉంది..

29-10-2024 04:47:21 PM

రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి

భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు..

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు అట్టహాసంగా ఎమ్మెల్యేలు ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క గింజ వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకపోవడంలో కుట్ర దాగి ఉందని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఆరోపించారు. రైతులు అడ్డుకి పావు సేరు వ్యాపారులకు అమ్ముకునేలా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని ఈ సందర్భంగా విమర్శించారు.

జిల్లాలో కోతల సీజన్ మొదలై నెల రోజులు కావస్తున్న ఇంతవరకు ఒక్క గింజ కూడా కొనకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రభుత్వం కొనకపోవడంతో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని రైతులు ఏం చేయాలో అర్థంకాక వర్షం వస్తుందా వడ్లు తడుస్తాయా అనే భయంతో మిల్లర్లకు వారు చెప్పిన ధరకే అమ్ముకోవడంతో క్వింటాల్కు దాదాపు 500 నుంచి 600 రూపాయలు నష్టపోతున్నారు, ఈ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. తక్షణమే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని మిల్లులను అలాట్మెంట్ చేయడం ద్వారా కొనుగోలు ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, సన్న వడ్ల విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం బోనస్ 500 ఇస్తానన్నప్పటికీ ఎటువంటి విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో రైతులు సన్న వడ్లను ధర వచ్చిన కాడికి అమ్ముకుంటున్నారు. వెంటనే సన్న రకాల వడ్లను కొనుగోలు చేసే విధివిధానాలను రూపొందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

గత పార్లమెంట్ ఎన్నికలతో పాటు తెలంగాణలో మరియు ఒరిస్సాలో శాసనసభకు ఎన్నికల జరిగినవి ఒరిస్సా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా 500 బోనస్ ఇస్తామని చెప్పి గత సీజన్ నుండే సన్నా దొడ్డు రకాల వడ్లను 3100 రూపాయలు ఇచ్చి రైతుల దగ్గర నుండి కొనుగోలు చేస్తుంది కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేయడంలో తాత్సారం చేయడంతో పాటు 500 బోనస్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది కాబట్టి జిల్లా అధికారులు వెంటనే చర్య తీసుకొని ధాన్యం కొనుగోలుకు మిల్లులను అలాట్మెంట్ చేయడం ద్వారా కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు వచ్చిన వడ్ల తోటే కొనుగోలు కేంద్రాలు నిండిపోయాయి రైతులు ఇక ముందు కోతలు కోసేవారికి కొనుగోలు కేంద్రాల్లో స్థలం లేక ఎక్కడ పోయాలో అర్థం కాని పరిస్థితిలో రోడ్లపై వడ్లను ఆరపోస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వానికి కనబడటం లేదా అని అన్నారు.